అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం.
- ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం తిరుపతి నగరంలో పారదర్శకంగా సాగింది.
- ఈ సందర్భంగా తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- వృద్ధులు, వికలాంగులు మరియు వితంతువులకు ఇబ్బంది కలగకుండా, వారి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందజేయడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు .
- వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించారని, నగరవ్యాప్తంగా వంద శాతం పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.
- నేరుగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ డబ్బులు అందజేయడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
- గతంలో పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వారు హర్షం వక్తం చేశారు.
- ముఖ్యంగా సామాజిక పెన్షన్లు పేద కుటుంబాలకు పెద్ద ఆసరాగా నిలుస్తున్నాయి.
- ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎక్కడా జాప్యం లేకుండా, పారదర్శక పద్ధతిలో అర్హులందరికీ పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు.
- తుడా ఛైర్మన్ స్వయంగా వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
- అదేవిధంగా సచివాలయ సిబ్బందితో మాట్లాడి జన గణన ప్రక్రియ కొనసాగుతున్న తీరును పరిశీలించి,పారదర్శకత ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.
- ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
