

మన న్యూస్: జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి సంధ్యారాణి ప్రత్యేకమైన రాష్ట్రం రావాలని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 53 రోజులు నిరాహారదీక్ష చేసి ప్రాణాన్ని అర్పించుకొని తెలుగువారందరికీ రాష్ట్రాన్ని సంపాదించిన మహా పుణ్యమూర్తి శ్రీ పొట్టిశ్రీరాములు అని మంత్రి సంధ్యారాణి అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛకోసం, ప్రజలు పరిపూర్ణంగా వ్యాపారాలు చేసుకోవటం కోసం, ఉద్యోగాలకోసం, అందరి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి శ్రీ పొట్టిశ్రీరాములు అని మంత్రి సంధ్యారాణి అన్నారు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.