కనిగిరి జనవరి 27 మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె ).
పామూరు మండల రెవెన్యూ శాఖలో ఉత్తమ సేవలందించిన పామూరు మండల తహసిల్దార్ రామచంద్రుని వాసుదేవరావు, ఆర్ ఐ శ్రీరామ్ అజయ్ కుమార్ లను మంగళవారం తహసిల్దార్ కార్యాలయంలో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి లు పట్టు వస్త్రంతో సన్మానించి అభినందనలు తెలిపారు. రెవిన్యూ కార్యాలయంలో జరిగిన అభినందన కార్యక్రమంలో బైరెడ్డి, దారపనేని మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా స్థాయిలో తొలిసారిగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా మండల ప్రజలకు వివిధ సేవలు అందించినందుకు గాను జిల్లా అధికారులు తహసిల్దార్ రామచంద్రుని వాసుదేవరావు, ఆర్ ఐ శ్రీరామ్ అజయ్ కుమార్ లకు జిల్లా అధికారులు వారికి ఉత్తమ పురస్కార అవార్డులు అందజేయడం హర్షించదగ్గ పరిణామం అని బైరెడ్డి, దారపనేని కొనియాడారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పురస్కారాలు అందుకోవాలని వారివురు ఆకాంక్షించారు. అదేవిధంగా పామూరు పట్టణ వీఆర్వో మండ్ల శ్రీనివాసులు, వీఆర్ఏ మెడ బలిమి రమేష్ లను అభినందిస్తూ సత్కరించారు. ఈ కార్యక్రమంలో మోపాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోరుబోయిన గిడ్డయ్య యాదవ్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.