మన ధ్యాస, నెల్లూరు, జనవరి 14 : నెల్లూరు నగరంలోని 42వ డివిజన్, మన్సూర్ నగర్ ఆర్చి వద్ద సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ , వారి సతీమణి రమాదేవి మరియు కుమార్తె షరిణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.​ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నారాయణ కుటుంబ సభ్యులకు డివిజన్ నాయకులు మరియు మహిళలు గజమాలతో ఘనంగా సత్కరించి, సాదర స్వాగతం పలికారు.తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులను మంత్రి మరియు వారి కుటుంబ సభ్యులు ఆసక్తిగా తిలకించారు.మహిళల సృజనాత్మకతను వారు ప్రత్యేకంగా అభినందించారు.పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు మంత్రి నారాయణ, రమాదేవి మరియు షరిణి స్వయంగా బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు.​”సంక్రాంతి పండుగ మన తెలుగు సంస్కృతికి చిహ్నం అని మహిళల్లో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయన్నారు. నగర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఈ సంక్రాంతిని జరుపుకోవలన్నారు..ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో ముస్లింలు ఉన్నప్పటికీ అందరూ కులమతాలకు అతీతంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.నెల్లూరు నగరం మొత్తం 50 కోట్ల రూపాయలు తో డ్రైనేజీ వ్యవస్థ పునర్నిర్మిస్తున్నామని..కాలువలు మొత్తం కాంక్రీట్ తో కాలువలు నిర్మిస్తున్నామన్నారు.2017లో నెల్లూరు నగరానికి వచ్చిన వరదల్లో మన్సూర్ నగర్ మొత్తం మునిగిపోయిందని,భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలియజేశారు.42వ డివిజన్లో ముగ్గుల పోటీల నిర్వాహకులను మంత్రి నారాయణ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజిజ్, ఇంచార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ తహసిన్,42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా, క్లస్టర్ ఇంచార్జి జాకిర్, కో క్లస్టర్ మొయినుద్దీన్, అధ్యక్షులు ఖలీల్, ప్రధాన కార్యదర్శి రఫీ, పార్లిమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇంతియాజ్ మైనారిటీ కార్యదర్శి కాలేషా, స్థానిక టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.​

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *