పోలియో చుక్కలు వేయిద్దాం,శాశ్వతంగా పోలియోను తరిమేద్దాం.టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు

కలిగిరి, డిసెంబర్ 20,మన ధ్యాస న్యూస్, (కె నాగరాజు).

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ నేతృత్వంలో స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్ అధ్యక్షతన నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పోలియో చుక్కల కార్యక్రమం డిసెంబర్ 21 న ఆదివారం నాడు ఉదయం నుండి పోలియో చుక్కలు కార్యక్రమం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరుగుతుందని టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పుట్టిన పిల్లలు నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలు వరకు తప్పక పోలియో చుక్కలు వేయించాలని ప్రతి యొక్క తల్లిదండ్రులను ఆయన కోరారు. పోలియో చుక్కలు వేయడం ద్వారా మన పిల్లలను అంగవైకల్యం నుండి శాశ్వతంగా కాపాడుకోవచ్చు అని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమం నియోజకవర్గంలోని అన్ని వైద్య ఆరోగ్య కేంద్రంలోనూ అలాగే ప్రతి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, తదితరులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలియో చుక్కల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని మన పిల్లలను (చిన్నారులను) పోలియో నుండి కాపాడుదాం శాశ్వతంగా పోలియోను సమాజం నుండి తరిమేద్దాం అని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *