కలిగిరి, మన న్యూస్, డిసెంబర్ 17,(కె నాగరాజు).

రాష్ట్ర శాసన మండల సభ్యులు బీద రవిచంద్ర తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా ఎంపిక కావడం శుభ పరిణామం అని రావులకొల్లు తెలుగుదేశం పార్టీ సర్పంచ్ పూసల వెంగపనాయుడు తెలియజేసారు.ఈ సందర్భంగా రావులకొల్లు సర్పంచ్ పూసల వెంగపనాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో పరిణతితో కూడిన నైతిక విలువలు కలిగిన నేతగా బీద రవిచంద్రను అభివర్ణించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బీద రవిచంద్ర చేసిన కృషి అజరామరం అని అన్నారు.బీద రవిచంద్ర తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాయలసీమ జోన్ ఇన్చార్జిగా, గతంలోనూ టిడిపి నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షునిగా విభిన్న హోదాలలో పదవులను అలంకరించి తెలుగుదేశం పార్టీకి మరింతగా వన్నెతెచ్చిన మహానుతలు అని అభిప్రాయపడ్డారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన బలమైన నేతగా ఉన్న బీద రవిచంద్ర యాదవును ఆయన పార్టీకి అందించిన విశేషమైన సేవలను గుర్తిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీద రవిచంద్ర ను నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులుగా నియమించడం పట్ల టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపినట్లుందని వెంగపనాయుడు అన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీ యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు రావులకొల్లు టీడీపీ సర్పంచ్ పూసల వెంగపనాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *