కనిగిరి నవంబర్ 26 మన ధ్యాస న్యూస్:///
కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం తూర్పుకోడిగుడ్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని జంగాలపల్లె గ్రామ వాస్తవ్యులు చెనికల వెంకటేశ్వరరావు, ధర్మపత్ని శ్రీమతి చెంచులక్ష్మి దంపతుల కుమార్తె లక్ష్మీ సౌభాగ్యవతి శ్రావణి, పామూరు మండలం మార్కొండపురం గ్రామపంచాయతీ పరిధిలోని భూమి రెడ్డి పల్లి గ్రామ వాస్తవ్యులు బాలే బోయిన మాలకొండ రాయుడు ధర్మపత్ని శ్రీమతి తిరుపతమ్మ దంపతుల కుమారుడు ప్రవీణ్ కుమార్ ల వివాహ వేడుకలు బుధవారం విజయవాడలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకల్లో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ కు అత్యంత సన్నిహితులైన చెనికల వెంకటేశ్వరరావు కుమార్తెను అక్షింతలతో ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకల్లో చెనికల చినమాల కొండయ్య (బొజ్జయ్య) మక్కా నాగరాజు, బొడ్డు వెంకటేశ్వరరావు, చెనికల నాగేశ్వరరావు, చెనికల శ్రీనివాసరావు, బొడ్డు సుధాకర్, బొడ్డు రవి, బొడ్డు పెద దానమయ్య, చిన్నదానమయ్య, మానం నాగేశ్వరరావు, మానం సాయి, మానం కిరణ్, చెనికల రామయ్య చెనికల బ్రదర్స్, మానం బ్రదర్స్, బొడ్డు బ్రదర్స్, బంధుమిత్రులు శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొని వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించారు.







