రైతుల సంక్షేమానికి భారీ నిధులు: రెండు విడతల్లో ₹6,310 కోట్లు రైతుల ఖాతాల్లో జమ..!ఉదయగిరి నియోజకవర్గ రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా ₹30.18 కోట్లు – 45,275 మంది రైతులకు లబ్ధి..!బొల్లినేని వెంకటరామారావు…
కలిగిరి నవంబర్ 19 మన ధ్యాస న్యూస్:://

కలిగిరి మండలం వెలగపాడు పంచాయతీలో జరిగిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ 2.0 రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో పాటు రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి బొల్లినేని వెంకటరామరావు పాల్గొన్నారు.అనంతరం రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు మాట్లాడుతూ, రైతుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రెండు విడతల్లో కలిపి ₹6,310 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది అన్నారు. ఈ నిధులు రైతులకు పంట సాగుకు, వ్యవసాయ ఖర్చులకు గొప్ప స్థాయి ఆర్థిక బలం అందిస్తున్నాయి, అని ఉదయగిరి నియోజకవర్గానికి మాత్రమే రెండో విడతలో 45,275 మంది రైతులకు ₹30.18 కోట్లు జమ చేయడం ద్వారా ప్రభుత్వం రైతుల పట్ల తన అంకితభావాన్ని మరోసారి చాటిచెప్పింది.అదేవిధంగా వ్యవసాయ పనులు నిరంతరంగా సాగేందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను కూడా విస్తృతంగా పంపిణీ చేసింది.అదేవిధంగా, ఉదయగిరి నియోజకవర్గ రైతులకు మొత్తం 976 క్వింటాళ్ల విత్తనాలు, 1161 మెట్రిక్ టన్నుల ఎరువులు అందజేయడం జరిగింది అన్నారు. పంట విత్తే సమయానికే విత్తనాలు, పంట పెరిగే దశలోనే ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం రైతులపై ఉన్న నిజమైన శ్రద్ధను స్పష్టంగా వెల్లడిస్తోంది. రైతు అవసరాలన్నింటికీ అండగా నిలబడి, పంట ఉత్పత్తి నుండి ఆదాయ భద్రత వరకు ప్రతి దశలో సహాయం చేస్తూ, నిజమైన రైతు ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అంతే కాకుండా నియోజకవర్గం లోని 8 మండలాల లో కొల్డస్టోరేజ్ లు ఏర్పాటు చేయలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్ళేరు. ఈ కార్యక్రమంలో కలిగిరి మండల అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణారెడ్డి, వెలగపూడి సర్పంచ్ దేవన బోయిన వెంకటసుబ్బయ్య, కలిగిరి పిఎసిఎస్ డైరెక్టర్ గన్నమనేని శ్రీనివాస నాయుడు, యూనిట్ ఇంచార్జ్ కర్నాటి ప్రభాకర్ చౌదరి, సర్పంచులు పోలవరపు సుబ్బానాయుడు, పూసల వెంగపనాయుడు, పాముల వరప్రసాద్, మాజీ సర్పంచ్ కేతినేని శివయ్య, ఎల్ఐసి ప్రసాద్, బొల్లా హనుమంతరావు, కార్యకర్తలు కూటమి కుటుంబ సభ్యులు అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
