- మండల అటవీ శాఖ అధికారి నాగేశ్వరరావు..
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో ది. 02.10.2025 నుండి 08.10.2025 వరకు నిర్వహించే “వన్యప్రాణి వారోత్సవాలు” లో భాగంగా సోమవారం శంఖవరం మండలం కొంతంగి కొత్తూరులో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏలేశ్వరం రేంజ్ పరిధిలో శంఖవరం సెక్షన్ సిబ్బంది శంఖవరం మండల అటవీ శాఖ అధికారి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “వన్యప్రాణుల సంరక్షణ – మనందరి బాధ్యత” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ, వన్యప్రాణుల మరియు అటవీ సంరక్షణ మనందరి బాధ్యత అని, జీవ వైవిద్యం ఆవశ్యకత గురించి అందరూ తెలుసుకోవాలని ముఖ్యంగా విద్యార్థులు వన్యప్రాణుల మరియు అటవీ సంరక్షణ పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు తోట సీతారామయ్య ప్రసంగించారు. అనంతరం “వన్యప్రాణుల సంరక్షణ మనందరి బాధ్యత” అనే అంశం పై విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీట్ అధికారి రమణ, బూరమ్మ , లావణ్య అటవీ శాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.







