శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరంలో గలకస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయానికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు లభించినట్లు కెజిబివి ప్రత్యేక అధికారిణి బాల మణికుమారి పేర్కొన్నారు. కాకినాడలోని కళాక్షేత్రంలో సోమవారం జరిగిన స్వర్ణ ఆంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవంలో శంఖవరం కెజిబివికి స్వచ్ఛ ఆంధ్ర అవార్డును కలెక్టర్ షన్మోహన్ చేతుల మీదుగాఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత నెల 9వ తేదీన స్వచ్ఛ ఆంధ్ర బృందం శంఖవరం కేజీబీవీ కి వచ్చి పరిసరాల పరిశుభ్రత పై క్షుణంగా పరిశీలించారన్నారు. కెజిబివిలో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, పరిసరాల పరిశుభ్రత పై నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని, స్వర్ణాంధ్ర… స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని కెజిబివిలో ప్రతి నెల మూడో శనివారం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. తమ కెజిబివికి ఈ అవార్డు రావడం ఎంత ఆనందంగా ఉందని భవిష్యత్తులో స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని మరింతగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఆమెను గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.







