మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తన క్యాంపు కార్యాలయంలో బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ అప్పా షెట్కార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కలిసి మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ- మల్లికార్జున్ అప్పా షెట్కార్ కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన సేవలు మరువలేనివి అని, పార్టీ బలపరచడంలో, కార్యకర్తలను ప్రోత్సహించడంలో ఆయన పోషించిన పాత్ర ఎంతో గొప్పదని గుర్తు చేశారు. ఆయన కృషి ఎల్లప్పుడూ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తుందని,నిజాయితీతో ప్రజలకు అండగా నిలిచిన నాయకుడిగా ఎప్పటికీ స్మరణలో నిలిచిపోతారని పేర్కొన్నారు.మల్లికార్జున్ అప్పా షెట్కార్ కలలుగన్న సమాజం నిర్మాణం కోసం తాము కృషి కొనసాగిస్తామని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *