వింజమూరు అక్టోబర్ 1:(మన ధ్యాస న్యూస్ ):///

వింజమూరు మండల కేంద్రంలోని ఎస్‌.వి. కన్వెన్షన్ హాల్‌ నందు నందు మండల కన్వీనర్ గొంగటి రఘునాథ రెడ్డి కుమార్తె చి||ల||సౌ. శాంతి గంధపు నలుగు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష హాజరై నవవధువుకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి , పలువురు కూటమి నాయకులు, బందుమిత్రులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *