మన ధ్యాస, నిజాంసాగర్( జుక్కల్ ) సెప్టెంబర్ 24 ,ఒక్కసారి జుక్కల్ నియోజకవర్గన్నీ సందర్శించాలని, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కేంద్ర గ్రామీణఅభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు కోరారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు బుధవారం కేంద్రసహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గం మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులో ఉండటంతో ఇక్కడ మరాఠీ, కన్నడ,తెలుగు భాషలు మాట్లాడుతరని,ఇది త్రిభాషా సంఘమంగా వర్ధిల్లుతుందని, సంస్కృతి,సంప్రదాయాలకు జుక్కల్ నియోజకవర్గం నిలయంగా ఉండటమే కాకుండా ఏ పండుగ నిర్వహించిన కర్ణాటక, మహారాష్ట్ర సంప్రదాయాలు ఇమిడి ఉంటాయని,చాలా ప్రాముఖ్యత గల జుక్కల్ సరిహద్దులో ఉండటంతో పాటు,గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆశాజనకంగా అభివృద్ధి చెందలేదని జుక్కల్ నియోజకవర్గానికి ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలని, అలాగే కమ్యూనికేషన్ పరంగా కూడా మారుమూల ప్రాంతాన్ని కనెక్టివిటీ కల్పించాలని ఎమ్మెల్యే తోట మంత్రి దృష్టికి తీసుకెళ్లగా,సానుకూలంగా స్పందించిన మంత్రి జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తానని,జుక్కల్ నియోజకవర్గంలో మరో మూడు బిఎస్ఎఎన్ఎల్ టవర్స్ కమ్యూనికేషన్ పరంగా అభివృద్ధి పరచడం జరుగుతుందని తెలపడం జరిగింది.ఎమ్మెల్యే తోట వెంట ఎన్ఆర్ ఐ కాంగ్రెస్ నాయకులు బుజంగారి భాస్కర్ రెడ్డి,ప్రముఖ కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *