మహమ్మద్‌నగర్, సెప్టెంబర్ 23:
మాతా, శిశు సంరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని సూపర్ వైజర్ రాజేశ్వరి అన్నారు.మహమ్మద్‌నగర్ మండలంలోని తుంకిపల్లి గ్రామంలో పోషణ మాసోత్సవాల భాగంగా అంగన్వాడీ కేంద్రంలో ఆమె ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ చిన్నారుల ఎదుగుదల, మాతా-శిశు సంరక్షణతోపాటు సంపూర్ణ ఆరోగ్య సాధనే తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.ఈ నెలాఖరు వరకు మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆరోగ్య రక్షణకు అవసరమైన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యవంతం చేయడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆమె వివరించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
