మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్ 23:
నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయం వద్ద బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పొదుపు సంఘాల మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను అందంగా కార్యాలయంలో పేర్చి సాంప్రదాయ గీతాల మధ్య మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడి,అనంతరం నిమజ్జనం చేశారు.
ఐకెపి ఎపిఎం ప్రసన్న రాణి మాట్లాడుతూ- బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని,మహిళలఏకతా,ఆత్మీయత,ఆనందాలకు సంకేతమని అన్నారు.పొదుపు సంఘాల ద్వారా మహిళలు స్వయం సమృద్ధి సాధించడంతో పాటు సామాజికంగా కూడా ముందడుగు వేస్తున్నారని అభినందించారు.ఈ కార్యక్రమంలో శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్,సీసీలు సాయిలు, శ్రీకాంత్,లక్ష్మణ్ తదితరులు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
