అమరావతి, ఉదయగిరి, సెప్టెంబర్ 23 (మన ద్యాస న్యూస్ ):////

ఉదయగిరి నియోజకవర్గం మండల కేంద్రం నుండి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రానికి డబల్ లైన్ రోడ్డు ఏర్పాటు చేయాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ శాసనసభలో తమ గళం వినిపించారు. మంగళవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీ సీ జనార్దన్ రెడ్డి గారికి ప్రశ్నను సంధించారు. ఉదయగిరి నియోజకవర్గం ఏర్పడిన నాటినుండి నేటి వరకు జిల్లా కేంద్రానికి డబల్ లైన్ రోడ్డు లేదని ఉదయగిరి నుండి నందవరం వరకు 29 కిలోమీటర్లు పొడవైన రోడ్డును డబల్ లైన్ రోడ్డుగా ఏర్పాటు చేస్తే, రెండు హైవే లను కలపడమే కాకుండా, జిల్లా కేంద్రం నుండి నియోజకవర్గానికి డబల్ లైన్ రహదారి ఏర్పడుతుందని, అంతేకాకుండా ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా కొంత భాగం ఈ రోడ్డు ఉందని, ప్రస్తుతం ఈ రోడ్డు పరిస్థితి కూడా అధ్వానంగా ఉందని సభాపతి ద్వారా మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అడిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *