క్రిబ్కో నూతన చైర్మన్‌ సుధాకర్ చౌదరిని సన్మానించిన ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, ఏలూరు సాంబశివరావు..!

విజయవాడ సెప్టెంబర్ 18 :(మన ద్యాస న్యూస్ ):///

క్రిబ్కో (KRIBHCO) నూతన చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త వల్లభనేని సుధాకర్ చౌదరి గారు ఎన్నికైన సందర్భంగా, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా గురువారం రాత్రి విజయవాడలోని ఆయన నివాసంలో, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , పర్చూరు ఎమ్మెల్యే శ్రీ ఏలూరు సాంబశివరావు గారితో కలిసి సుధాకర్ చౌదరి గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఇద్దరు ప్రజాప్రతినిధులు కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.కాకర్ల సురేష్ మాట్లాడుతూ “వల్లభనేని సుధాకర్ చౌదరి వ్యాపార రంగంలోనే కాకుండా సమాజహితం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తూ, ప్రజలకు ఆదర్శప్రాయమైన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన క్రిబ్కో చైర్మన్‌గా ఎన్నిక కావడం తెలుగు ప్రజలకు గర్వకారణం. ఆయన నాయకత్వంలో క్రిబ్కో మరింత అభివృద్ధి సాధించి రైతాంగానికి, వ్యవసాయ రంగానికి మరింత మేలు చేస్తుంది” అని అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *