

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: పట్టణంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలను ఏలేశ్వరం చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ చీరంజీవి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం అన్నారు.ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు,పంపిణీ చేశారు.మధ్యాహ్నం భవిత దివ్యాంగుల పాఠశాలలో కేక్ కట్ చేసి,విద్యార్థులకు భోజనాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఈకార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ముచ్చర్ల విజయ్ కుమార్,లోగీసు శేఖర్,సిరిపురపు రాజేష్,అనంతరపు రాజు,బిగ్ బాస్,మసిరపు నాగేశ్వరరావు,ఎండగుండి నాగబాబు,ఆతం అప్పారావు,కోరాడ రాజు, జంగా ధనబాబు,గొల్లపల్లి త్రినాధ్, శశి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.