

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానిక వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు వరుపుల సత్యప్రభ హాజరయ్యారు.అనంతరం పిఎసిఎస్ అధ్యక్షుడు సూతి బూరయ్య,సభ్యులతో ముందుగా రిజిస్టర్లో చెసి సంతకాలు బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మాట్లాడుతూ పాలకవర్గం సొసైటీ అభివృద్ధికి, రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కారానికి తోడ్పాటు అందించాలని నూతన పాలకవర్గాన్ని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, జనసేన నాయకులు మేడిశెట్టి బాబి, కౌన్సిలర్లు బొద్దిరెడ్డి గోపి,అలమండ చలమయ్య,బిజెపి నాయకుడు సింగిలి దేవి సత్యరాజు,బద్ది రామారావు,చిక్కాల లక్ష్మణరావు,ఎంపీటీసీ కొప్పుల బాబ్జి, బ్యాంకు రాజు,గట్టెం వెంకటరమణ, జ్యోతుల శ్రీనివాస్ సూతి బాబులు,చందువొలు రాజా,పాలకవర్గ సభ్యులు వైభోగుల సుబ్బారావు,కొప్పిశెట్టి సూరిబాబు తదితర కూటమి శ్రేణులు పాల్గొన్నారు.