

మన న్యూస్: కరకగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పర్యటనలో భాగంగా రేగళ్ల పంచాయతీ మాదన్నగూడెం లో ఎన్నో ఏళ్లగా కరెంటు లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం దృష్టికి మాదన్నగూడెం గ్రామస్తులు తీసుకురాగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే ఉన్నత అధికారులతో మాట్లాడి 2 లక్షల ఖర్చుతో 25 కె.వి ట్రాన్స్ఫారాన్ని రేగళ్మా దన్నగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించి మాదన్నగూడెం గ్రామస్తుల సమక్షంలో ఎమ్మెల్యే ట్రాన్స్ఫారాన్నికి కొబ్బరికాయ కొట్టి నూతనంగా ప్రారంభించారు, అడిగిన వెంటనే స్పందించి ఎన్నో ఏళ్లగా చీకటిలో జీవిస్తున్న 100 కుటుంబాలకు వెలుగునిచ్చినటువంటి పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కి కృతజ్ఞతలు తెలియజేసిన రేగళ్ల మాదన్నగూడెం గ్రామ ప్రజలు ఈ యొక్క కార్యక్రమానికి ఎలక్ట్రికల్ ఏ. ఈ నరేందర్ రెడ్డి , ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు