మన న్యూస్ ,గూడూరు:ఒకే స్లో రిమాండ్ లో ఉండి శనివారం బెయిల్ పై రిలీజ్ అయిన వైసీపీ కార్యకర్తలు ,వారిని రిసీవ్ చేసుకున్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, వైసిపి యూత్ రాష్ట్ర కార్యదర్శి కొండూరు సునీల్ కుమార్ రెడ్డి,ఎంపీపీ బూదురు గురవయ్య మరికొంత మంది వైసిపి నేతలు,కార్యకర్తలు.గూడూరు నియోజక వర్గంలో వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని,కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ కోరారు.గూడూరు నియోజకవర్గం లోని పురిటి పాలెంకు చెందిన దయాకర్ తో పాటు మరో ఇద్దరు పై ఇటీవల గూడురు రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసు లో నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారం లో రిమాండ్ లో ఉన్న 5 మంది ఈ రోజు బెయిల్ పై రిలీజ్ అయ్యారు, వీరిని గూడూరు నియోజక వర్గం వైసిపి ఇంచార్జ్ ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, వైసిపి యూత్ రాష్ట్ర కార్యదర్శి కొండూరు సునీల్ రెడ్డి,మరికొంత మంది వైసిపి నేతలు పరామర్శించారు,ధైర్యంగా ఉండాలని తప్పుడు కేసులు తో తాత్కాలిక సంతోషం పొందగలరేమో కానీ ఇది మంచి పద్ధతి కాదని చట్ట పరంగా ఎదుర్కొంటామని జైలు నుండి వచ్చిన వారికి మనో ధైర్యం కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *