రామచంద్ర యాదవ్ పై రౌడీ ల ప్రవర్టించిన సీఐ సత్యనారాయణ పై చర్యలు తీసుకోవాలి

ప్రత్తిపాడు నియోజకవర్గ బీసీవై పార్టీ ఇంచార్జ్ గొంప శివ కుమార్ యాదవ్;

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్;
బీసీ వై పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్, కూటమి ప్రభుత్వం మెగా డి ఎస్ సి పేరుతో నిరుద్యోగులను మోసం చేశారంటూ, శాంతియుతంగా తలపట్టిన ర్యాలీలో సీఐ సత్యనారాయణ చేసిన చేస్టలపై కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గ భారత చైతన్య యువజన పార్టీ ఇంచార్జి గొంప శివ కుమార్ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గొంప శివ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రం లో ఏ అన్యాయం జరిగిన వెంటనే స్పందించే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రామచంద్ర యాదవ్ అని, ఇప్పుడు కూడ ఏడు ఏళ్ళ తరువాత డీఎస్సీ ఇవ్వడం వల్ల ఎంతో మంది అభ్యర్థులు వయోపరిమితి వల్ల అర్హత కోల్పోతున్నారు అని, ఈ అంశం పై అభ్యర్థులకు మద్దతుగా నిలబడి, వారికీ న్యాయం జరగాలనే తపనతో ఈ శాంతియిత ర్యాలీ నిర్వహించారని అన్నారు. కానీ ఎంతో ప్రశాంతంగా జరుగుతున్న ఈ ర్యాలీలో ఒక బాధ్యత గల ఉద్యోగి అయ్యి ఉండి ఇలా రౌడీలా మాదిరి ప్రవర్తించడం రాజ్యాంగ విరుద్దమని అన్నారు. పోలీసులు అంటే ప్రజలకు ఎంతో నమ్మకం అని, ఎక్కడ ఏ ఆపద జరిగిన పోలీసులకు చెప్పుకుంటె ఆ సమస్య తీరుతుందనీ ప్రజలు అనుకుంటారని, కానీ కొద్దిమంది సీఐ సత్యనారాయణ లాంటి పోలీసులు వల్ల ప్రజలలో నమ్మకం పోయేలే ఉంది అని మండిపడ్డారు. రాష్ట్ర పోలీస్ అధికారి వారు సీఐ సత్యనారాయణ పై విచారణ జరిపించి, తక్షణమే చర్యలు తీసుకోకపోతె, రాష్ట్రం లో ఉన్న నిరుద్యోగులు భారత చైతన్య యువజన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఉద్యమించాల్సి వస్తుందని అన్నారు. దాదాపు ఏడు సంవత్సరాల నుండి డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మెగా డీఎస్సీ ఇస్తామని లోకేష్ తన యువ గళం పాదయాత్రలో హామీ ఇచ్చి, ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొదట సంతకం మెగా డీఎస్సీ పై పెట్టి సుమారు 16340 పోస్టులు విడిచే విడుదల చేస్తాం అని మాయమాటలు చెప్పి, హడావిడిగా 45 రోజుల్లోనే పరీక్షలు పెడితే, చదవడానికి సమయం సరిపోదని, మరియు అభ్యర్థుల వయోపరిమితి 42 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలకు పెంచాలి అని, అంతేకాకుండా నార్మలైజేషన్ పద్ధతిని రద్దుచేసి ఒక జిల్లాకు ఒకే విధమైన ప్రశ్నాపత్రంతో పరీక్ష నిర్వహించాలి అనే డిమాండ్లతో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ శాంతియుత ర్యాలీ చేస్తే వారిని అడ్డుకొని దాడి చేయాలని చూసినా సత్యనారాయణపురం సిఐ లక్ష్మీనారాయణ వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు. తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని జరపడానికి వంద రోజులు ముందు నుండే ఏర్పాట్లు చేస్తారు కానీ, చదువుకోడానికి నిరుద్యోగులకు 45 రోజులు కేటాయిస్తే ఎలా అంటూ ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో బీసీవై పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..