

మన న్యూస్, నెల్లూరు/ కడప:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఘనంగా సత్కరించారు. మహానాడు సభ వేదికపై రెండవ రోజున పార్టీ అధ్యక్షుడు ఎన్నిక అనంతరం చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వేమిరెడ్డి దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

