

మన న్యూస్, నెల్లూరు:అమ్మ…ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఎంత చెప్పినా తక్కువేనని…..రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె షరణి అన్నారు .ఈ సందర్భంగా నెల్లూరు నగరం పప్పులవిధిలో ఆదివారం జరిగిన ముక్కాల ద్వారకనాధ్ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో జరిగిన తల్లికి పాదాభివందనం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అనంతరం ఆమె మాట్లాడుతూ…… ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగాఉందన్నారు..ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ అని అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిదన్నారు..మాటలకు అందనిది అమ్మ ప్రేమ అని..బ్రహ్మ సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదన్నారు..అమ్మ అంటే ఓ అనుభూతి… ఓ అనుబంధం… ఓ ఆప్యాయత…ఓ ఆత్మీయత అని కొనియాడారు.. ఈ కార్యక్రమంలో మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ,నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి సుజిత, కోట సూర్యనారాయణ, పేర్ల సీతారామారావు, శ్రీరామ్ సురేష్, బైసాని జ్యోతి ప్రసాద్ తదితరులు అధిక సంఖ్యలో తల్లులు పాల్గొన్నారు.




