

మన న్యూస్ ,గూడూరు, మే 17: తిరుపతి జిల్లా గూడూరు రైల్వే స్టేషన్ పడమర వైపు నార్త్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని మగవ్యక్తి (వయస్సు సుమారు 70 సంవత్సరాలు) మృతదేహం గురించి 17వ తేదీ ఉదయం 8:00 గంటలకు గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అయినా బి. గోపాల్ కి రాబడిన సమాచారము మేరకు మృతుడు 16వ తేదీ సాయంత్రం నుండి 17వ తేదీ ఉదయం మధ్య ఏదైనా సమయంలో మృతి చెందినట్లు తెలుస్తున్నది . చుట్టూ ప్రక్కల ప్రజల అభిప్రాయం ప్రకారం, మృతుడు గత కొంత కాలముగా గూడూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో బిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడని. ఆయన దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడని స్థానికులు తెలియజేశారు. మృతుని శవమును గూడూరు మార్చురీ రూమ్ లో బద్రపరచి వున్నది. మృతుని గుణచిహ్నాలు మరియు దుస్తుల వివరాలు ఇలా ఉన్నాయి:• మృతుని కుడి చేతిపై జయలక్ష్మి అని పచ్చబొట్టు వున్నది • పసుపు రంగు చొక్కా ధరించి ఉన్నాడు• కాషాయపు రంగు పంచె కట్టుకున్నాడు• తెల్లటి మాసిన గడ్డం ఉంది• శరీరం అధికంగా క్షీణించిన స్థితిలో ఉంది మృతుని వద్ద ఎటువంటి గుర్తింపు పత్రాలు లేదా వ్యక్తిగత వివరాలు లభించలేదు. అతని గుర్తింపుపై ఎవరికైనా సమాచారం ఉంటే, దయచేసి గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి. ఆచూకీ తెలియజేయ వలసిన అధికారుల ఫోన్ నంబర్స్ :- SI :91002 44099 :CI :9440796343
