ఇనమడుగులో మిని ఆటోనగర్ కు భూమి పూజ చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,కోవూరు, మే 14:- ఇనుమడుగు మిని ఆటోనగర్ లో మౌళిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తా.. – ఆటోనగర్ లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాను. – రోడ్డు విస్తరణలో నిరాశ్రయులైన నిరాశ పడకుండా సమిష్టి కృషితో ఆటోనగర్ నిర్మించుకున్న కార్మిక సోదరులను అభినందిస్తున్నాను. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఇనమడుగు మిని ఆటోనగర్ కార్మిక సోదరులకు ప్రభుత్వం తరుపున ఏ అవసరమొచ్చినా నేను అండగా వుంటానన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కోవూరు మండలం ఇనమడుగు సెంటర్లో “ఇనుమడుగు సెంటర్ వర్కర్స్ వెల్ఫేర్‌ అసోసియేషన్” పేరిట ఏర్పాటు చేసుకున్న మిని ఆటోనగర్ నిర్మాణ భూమిపూజ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెకానిక్ సోదరులు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. లక్కీ డిప్ ద్వారా 65 మంది మెకానిక్, లేత్, వెల్డింగ్ తదితర ఆటో బేసెడ్ వృత్తులు చేసుకునే కార్మికులకు షాపులు కేటాయించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ 65 మంది కార్మిక సోదరులు తమ కష్టార్జితంతో నిర్మించుకున్న మిని ఆటోనగర్‌ భూమిపూజలో పాల్గొనడం చాలా సంతోషంగా వుందన్నారు. ఇనుమడుగు సెంటర్లో ఫోర్ లైన్ రోడ్డు విస్తరణ సందర్భంగా షాపులు కోల్పోయి నిరాశ్రయులైన నిరుత్సాహ పడకుండా అందరు కలిసి మిని ఆటోనగర్ నిర్మించుకుంటున్న కార్మిక సోదరులు సమిష్టి సమిష్టి స్ఫూర్తిని అభినందించారు. ఇనుమడుగు చుట్టు పక్కల ప్రాంతాలలో రైతులకు సంబంధించిన ట్రాక్టర్ల రిపేర్లు, వ్యవసాయ సంబంధిత పరికరాల తయారీతో ఈ మిని ఆటోనగర్ దినదినాభి చెందాలని ఆకాంక్షించారు. కోవూరు, విడవలూరు, కొడవలూరు మండల నాయకులు పార్టీల కతీతంగా ఇనమడుగు ఆటోనగర్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఇనమడుగు ఆటోనగర్ అవసరాల కోసం అడిగిన వెంటనే ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాటు చేసిన విద్యుత్ శాఖా అధికారులకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ధన్యవాదాలు తెలియ చేసారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఆటోనగర్ కార్మిక సోదరుల కోసం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని హామి యిచ్చారు. ప్రభుత్వ నిధులతో ఆటోనగర్ లో రోడ్లు, డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. “ఇనుమడుగు సెంటర్ వర్కర్స్ వెల్ఫేర్‌ అసోసియేషన్” ఆధ్వర్యంలో కార్మికులందరూ ఐకమత్యంగా వుంటూ సమిష్టి కృషితో అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆకాంశించారు. ఈ కార్యక్రమంలో పెన్నాడెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాలరెడ్డి, APSPDCL EE రమేష్ చౌదరి, తహసీల్దార్ నిర్మలానంద బాబా, ఎంపిడిఓ శ్రీహరి రెడ్డి, కోవూరు మండల టిడిపి అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, టిడిపి నాయకులు జెట్టి మదన్ రెడ్డి, DCN శ్రీనివాసులు నాయుడు, యాకసిరి వెంకటరమణమ్మ, సూరిశెట్టి శ్రీనివాసులు, బిజెపి నాయకులు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు