

మనన్యూస్,తిరుపతి:బిజెపి నాయకులు, మాజీ కౌన్సిలర్ నవీన్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి పరామర్శించారు. ఇటీవల బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి మాతృమూర్తి శారదమ్మ చెందిన విషయం తెలిసిందే. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున శుభ స్వీకరణ కార్యక్రమానికి రాలేకపోయానని ఎంపీ తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం నవీన్ కుమార్ రెడ్డి ఇంటికి ఎంపీ గురుమూర్తి చేరుకుని వారి మాతృమూర్తి శారదమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. నవీన్ కుమార్ రెడ్డి, టిడిపి నేత, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి,వారి కుటుంబ సభ్యులకు డాక్టర్ గురుమూర్తి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
