

మనన్యూస్,నెల్లూరు:ఇటీవల చెన్నైలో అపోలో హాస్పిటల్ నందు మోకాలికి శస్త్ర చికిత్స చేయచుకొని నెల్లూరు బాలాజీ నగర్ లోని వారి నివాసం నందు విశ్రాంతి తీసుకొంటున్న తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి,మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ ను తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి శనివారం పరామర్శించారు.వీరి తో పాటు నెల్లూరు పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి డా ఊరందూరు సురేంద్ర, నెల్లూరు పార్లమెంట్ TNSF, iTDP అధ్యక్షులు అమృల్లా, రసూల్ తదితరులు కూడా ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ ను పరామర్శించారు.
