

మనన్యూస్,తిరుమల:మాజీ ఎం.పీ డా॥నారమల్లి శివప్రసాద్ మనవడు, వి.ఎం.గ్రూప్ అధినేత, కేఎస్పీ టాకీస్ చైర్మన్ శ్రీ కేతన్ శివ ప్రీతమ్ టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.వారి తండ్రి స్వర్గీయ గుంతాటి వేణుగోపాల్ గారి జ్ఞాపకార్థం ఈ విరాళాన్ని అందించినట్టు తెలిపారు.ఈ మేరకు విరాళం డీడీని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి తిరుమలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.ఈ సందర్భంగా దాతను అదనపు ఈవో అభినందించారు.
