మన న్యూస్ పలాస – కాశీబుగ్గ ; పలాస కాశీబుగ్గ మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరం వద్ద , రైల్వే స్టేషన్ కి వెళ్లే రహదారిలో సోమవారం నాడు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు నాగజ్యోతి,భారతి మిడియాకి తెలిపారు. వారు మాట్లాడుతూ… ప్రతీ రోజూ సాయంత్రం 40 మందికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. అయితే ఈ స్వామి వివేకానంద సేవా సమితిని స్థాపించిన వాళ్లు రాపాక పాపారావు(బన్ని), కిరణ్ కుమార్, ధర్మారావు వీళ్ళ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా 8 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇదే కాకుండా భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆపదలో ఉన్న వాళ్ళకి తమ ట్రస్టు తరుపునుండి సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. అయితే సభ్యులు అయినటువంటి భారతి, నాగజ్యోతి గృహిణులు అయినప్పటికీ ఇటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో స్ధానిక ప్రజలు, హర్షిస్తున్నారు. బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.