

నియోజకవర్గ నుంచి 20వేల మంది హాజరవుతామన్న తుమ్మలపల్లి రమేష్
మనన్యూస్,కాకినాడ,గొల్లప్రోలు:జగంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం జి.రాగంపేట శివారున పరిణయ ఫంక్షన్ హాల్ లో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు సంబంధించి జగ్గంపేట నియోజకవర్గ నాలుగు మండల జనసైనికులు సమాయత్తం చేయడానికి ఆవిర్భావ సభ జగ్గంపేట నియోజకవర్గం కోఆర్డినేటర్లు గాంధీ, శ్యాం సుధాకర్ రావు ఆధ్వర్యంలో మరియు జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ పర్యవేక్షణలో ఈ రోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కోఆర్డినేటర్లు మార్చి 14న జరిగే ఆవిర్భావ సభకు నాలుగు మండల జనసైనికులతో విడివిడిగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆవిర్భావ సభకు భారీ జనాల్ని తరలించడానికి జనసైనికులకు దిశా నిర్దేశం చేశారు. కోఆర్డినేటర్ అయిన అక్కల గాంధీ మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో మొన్న 8 వ తారీఖున నిర్వహించిన నియోజకవర్గ స్థాయి మీటింగ్ అత్యంత అద్భుతంగా తుమ్మలపల్లి రమేష్ గారు నిర్వహించారు అని, అలాగే నియోజకవర్గ ప్రజలను జనసైనికులను జనసేన కార్యకర్తలను ఆవిర్భావ సభకు తరలించడానికి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ భారీ స్థాయిలో వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి జన సైనికులు అందరూ కూడా తుమ్మలపల్లి రమేష్ గారి నాయకత్వంలో 14 వ తారీఖున భారీ స్థాయిలో పిఠాపురం కదిలి రావాలని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఆవిర్భావ సభ ఒక పండగ వాతావరణం జరుపుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని పేరుపేరునా ఆహ్వానిస్తున్నారని, అలాగే జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో జన సైనికులు ఇంటింటికి వెళ్లి అందరిని ప్రజల్ని ఆహ్వానిస్తున్నారని, ఆవిర్భావ సభకు జగంపేట నియోజకవర్గం నుంచి 20వేల మంది హాజరవుతామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్లు అక్కల గాంధీ, శ్యామ్ సుధాకర్ రావు, మరిసే రామకృష్ణ, ఉలిసి ఐ రాజు, సింగలూరి రాందీపు, గోకవరం మండల టౌన్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ, అరినే రాజేష్,ఎంపీటీసీ దొడ్డ శ్రీను, ఎల్లపు దొరబాబు,సీనియర్ నాయకులు కంచే కోటీ, నల్లల శివ, గంధం ప్రభాకర్,కాకిలేటి బాబ్జి,డేగల విజయ్,శివరామకృష్ణ, మిరియాల గాంధీ, నాని, గంటా తేజ, సత్తి సోమరాజు, పితాని వీరబాబు ఇతర నాయకులు పాల్గొన్నారు
