మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరీదిలోని కృష్ణ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణ నది వాగులో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తుంటే టాస్క్ ఫోర్స్, కృష్ణ పోలీసులు దాడులు నిర్వహించి, ఐదు ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగిందని,అందులో ఒకటి ఇసుకతో ఉండగా మిగతా నాలుగు ట్రాక్టర్లు ఖాళీగా ఉన్నందున అన్ని ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించి ట్రాక్టర్ల ఓనర్స్ మరియు డ్రైవర్స్ పై కేసు నమోదు చేయడం జరిగిందని కృష్ణ ఎస్సై ఎస్ఎం నవీద్ తెలిపారు. ఎవరైన అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *