మనన్యూస్,జోగులాంబ:ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే విజయుడు హాజరై లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల పెళ్లి కానుకగా ప్రభుత్వం లక్ష 116 రూపాయలు ప్రభుత్వం అందించడం జరుగుతుందన్నారు.ప్రభుత్వం పంపిణీ చేసిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులు సకాలంలో బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.అలంపూర్,ఉండవెల్లి,ఇటిక్యాల,మానవపాడు,వడ్డేపల్లి,రాజోలి మండలాలకు చెందిన 400 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తహశీల్దారులు రెవెన్యూ సిబ్బంది,బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *