

పేదలకు అన్నదానం చేసిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ..
మనన్యూస్,తిరుపతి:మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ వెంకటరమణ78 వ జయంతి ని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. శనివారం కపిల్ తీర్థం సమీపంలోని మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ ఘాటుకు చేరుకొని ఆయన విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరుపతి అభివృద్ధికి ఆయన చేసిన సేవలను పలువురు నేతలు స్మరించుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ ప్రతి ఏటా ఆయన జయంతిని పురస్కరించుకొని పలు సామాజిక సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని చెప్పారు.వెంకటరమణ కు నివాళులు అర్పించిన వారిలో పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు సూరా సుధాకర్ రెడ్డి,దంపురి భాస్కర్ యాదవ్, నరసింహ యాదవ్,శ్రీధర్ వర్మ,ఆర్ సి మునికృష్ణ, పులిగోరు మురళీ కృష్ణారెడ్డి,
పుష్పావతి యాదవ్, రుద్రకోటి సదాశివం, బ్యాంకు శాంతమ్మ, మునిశేఖర్ రాయల్, ఆర్ పి శ్రీనివాసులు, షేక్ మహబూబ్ భాషా, గంజి సుధాకర్ రెడ్డి టిడిపి డివిజన్ ఇన్చార్జిలు క్లస్టర్ ఇన్చార్జిలు పార్టీ కార్యకర్తలు ఉన్నారు.

