దేశ రక్షణ అందరి బాధ్యత:సీఎం రేవంత్రెడ్డి

మనన్యూస్,శేరిలింగంపల్లి:జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో విజ్ణాన్ వైభవ్ 2కే 25 ప్రదర్శనను ప్రారంభిం చారు కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి. సీవీరామన్, అబ్దుల్ కలాం విగ్రహాలకు రాజ్ నాథ్, రేవంత్ రెడ్డి నివాళులర్పిం చారు.చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి , పీఏసీ చైర్మన్,ఎమ్మెల్యే గాంధీ, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ , శివ సేన రెడ్డి , పాల్గొన్నారు.ఈ ప్రదర్శనలో DRDO, ఎరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కలాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సెలెన్స్ సంయుక్తంగా రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ఇలాంటి వైజ్ణానిక ఎగ్జిబిషన్ల ఏర్పాటుతో విద్యార్థులకు రక్షణ వ్యవస్థపై మరింత అవగాహన వస్తుందన్నారు.తెలంగాణ రాష్ట్రం.. ప్రత్యేకించి హైదరాబాద్ నగరం కొన్ని దశాబ్దాలుగా దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న బీడీఎల్, డీఆర్‌డీఓ, మిథాని, హెచ్ఏఎల్ వంటి సంస్థలు దేశ రక్షణ కోసం రాకెట్లు, మిస్సైల్స్ తదితర ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.దేశ రక్షణ రంగానికి హైదరాబాద్‌తో పాటు బెంగళూరు ముఖ్య కేంద్రాలుగా ఉన్నాయి. ఈ రెండు నగరాల మధ్య “హైదరాబాద్-బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్”ను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గతంలోనూ కోరాం.హైదరాబాద్-బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్” ఏర్పాటు ద్వారా రక్షణ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తాయి. స్కైరూట్ లాంటి స్టార్టప్, ప్రైవేటు సంస్థలు ఇప్పటికే రాకెట్లను తయారు చేస్తున్నాయి. కారిడార్ ప్రకటన రక్షణ రంగానికి మరింత ఊతం ఇచ్చినట్టు అవుతుందన్నారు.

  • Related Posts

    ప్రపంచ సాహితీ సంబరాల్లో యువ కవి శ్రీ నక్కిన ధర్మేష్ కి” యువ కీర్తి ” జాతీయ అవార్డు

    ఏలూరు మన న్యూస్: – అంతర్జాతీయ ( ఐ.ఎస్.ఒ.) సంస్థ శ్రీశ్రీ కళావేదిక సీఈవో డా. కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో. మే 10,11 ఘనంగా ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలు నిర్వహించారు. జిల్లాకేంద్రం ఏలూరులోని మహాలక్ష్మి వేణుగోపాల కల్యాణ మండపం లో…

    ఏలేరు కాలువలో గల్లంతయిన యువకుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే…

    శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్) : కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం పెద శంకర్లపూడి గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు ఏలేరు కాలువలో ఈతకు దిగడంతో ఇద్దరు నీటి ఉధృతి కొట్టుకుపోయారు.. వారిలో ఒకరిని స్థానికులు రక్షించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రపంచ సాహితీ సంబరాల్లో యువ కవి శ్రీ నక్కిన ధర్మేష్ కి” యువ కీర్తి ” జాతీయ అవార్డు

    ప్రపంచ సాహితీ సంబరాల్లో యువ కవి శ్రీ నక్కిన ధర్మేష్ కి” యువ కీర్తి ”  జాతీయ అవార్డు

    ఏలేరు కాలువలో గల్లంతయిన యువకుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే…

    ఏలేరు కాలువలో గల్లంతయిన యువకుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే…

    పి4 విధానంపై వైసిపి విష ప్రచారం-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    పి4 విధానంపై వైసిపి విష ప్రచారం-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    ఎస్ ఆర్ పురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోటీ కి పోటీ ఎక్కువే ప్రతిసారి ఎస్ఆర్ పురం మండలంలో కమ్మ సామాజిక వర్గానికే నా మండల అధ్యక్షుడు పదవులు ?బిసి లు, ఎస్సీలు అధ్యక్షులు పదవికి పనికిరారా ?

    ఎస్ ఆర్ పురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు  పోటీ కి పోటీ ఎక్కువే ప్రతిసారి ఎస్ఆర్ పురం మండలంలో కమ్మ సామాజిక వర్గానికే నా మండల అధ్యక్షుడు పదవులు ?బిసి లు, ఎస్సీలు అధ్యక్షులు పదవికి పనికిరారా ?