

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు:నియోజవర్గ కేంద్రమైన ప్రత్తిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మహిళా చట్టాలు,హక్కులు,బాల బాలికల రక్షణ,సైబర్ నేరాలపై అప్రమత్తత పట్ల ప్రత్తిపాడు ఎస్సై ఎస్ లక్ష్మికాంతం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై ఎస్ లక్ష్మికాంతం మాట్లాడుతూ మహిళల చట్టాలను విద్యార్థినిలకు వివరించారు.ఎవరైనా ఆకతాయిలు,మహిళలు,చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అటువంటి విధంగా ఎవరైనా మీతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లయితే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ముఖ్యంగా గుడ్ టచ్,బ్యాడ్ టచ్ పై మహిళా పోలీస్ సిబ్బంది ద్వారా వివరించారు.డిజిటల్ అరెస్టులకు అనేవి లేవని అటువంటి విధంగా ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తే మోసపోవద్దని అవగాహన కల్పించారు.విద్యార్థిని విద్యార్థులు పాఠశాలకు వెళ్లేటప్పుడు,వచ్చేటప్పుడు రోడ్డుకి ప్రక్కగుండా నడుస్తూ జాగ్రత్తలు పాటించాలన్నారు.
అదే విధంగా ప్రేమ పేరుతో వంచన చేసే నయవంచకుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.అటువంటి వారి పట్ల అప్రమత్తంగా వ్యవహరించి,లవ్ ట్రాప్ జోలికి పోకుండా శ్రద్ధగా చదువుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,మహిళా పోలీసులు,పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.