శాఖాహారం ప‌ట్ల మ‌రింత అవ‌గాహాన క‌ల్పించాలిః ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తి:అహింసా ధ్యాన మ‌హోత్స‌వంలో భాగంగా తిరుప‌తి స్పిర్చువ‌ల్ సొసైటీ మెగా శాఖాహార ర్యాలీ న‌గ‌రంలో ఆదివారం ఉద‌యం నిర్వ‌హించింది.ఈ ర్యాలీని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు.పుణ్య‌క్షేత్ర‌మైన తిరుప‌తిలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం ఎంతో ముఖ్య‌మ‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు చెప్పారు.మెగా శాఖాహార ర్యాలీ ద్వారా స్పిర్చువ‌ల్ సొసైటీ ప్ర‌జ‌ల్లో శాఖాహారం ప‌ట్ల అవ‌గాహాన తీసుకురావ‌డం అభినంద‌నీయ‌మ‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రు యోగా,ధ్యానం త‌మ దిన చ‌ర్య‌లో భాగం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు.ఆధునిక జీవ‌న‌శైలితో పెరుగుతున్న ఒత్తిడిని జ‌యించ‌డాన‌కి యోగా చ‌క్క‌ని ప‌రిష్కార‌మార్గ‌మ‌ని ఆయ‌న తెలిపారు.న‌రేంద్ర మోది ప్ర‌ధాన‌మంత్రి అయ్యాక యోగాను ప్ర‌పంచ‌వ్యాప్తం చేశార‌ని ఆయ‌న కొనియాడారు.తిరుప‌తి స్పిర్చువ‌ల్ సొసైటీ ప్ర‌జ‌ల్లో ఆధ్యాత్మిక భావ‌న పెంపొందించేందుకు చేస్తున్న కృషి అభినంద‌నీయ‌మ‌ని ఆయ‌న తెలిపారు.ఈ కార్య‌క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే మోహ‌న్,మాజీ ఎమ్మెల్సీ బ‌త్యాల చెంగ‌ల్రాయ‌లు,టిటిడి బోర్డు స‌భ్యులు భానుప్ర‌కాష్ రెడ్డి,డిప్యూటీ మేయ‌ర్ ఆర్సీ మునికృష్ణా,కార్పోరేట‌ర్లు న‌ర‌సింహాచ్చారి,ఎస్ కే బాబు,పొన్నాల చంద్ర‌,బిజేపి జిల్లా అధ్య‌క్షులు సామంచి శ్రీనివాస్,సింగంశెట్టి సుబ్బ‌రాయులు,వ‌ర‌ప్ర‌సాద్,కూర‌పాటి సురేష్ కుమార్,కోదండ‌,ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Related Posts

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మార్కెట్ సమీపంలో గల జుమా మసీదు కు సంబంధించిన పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జుమా మసీదు డెవలప్మెంట్ కమిటీ…

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి