మనన్యూస్,కామారెడ్డి:ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు.శాసన మండల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ తెలిపారు.ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా ప్రతి సోమవారం నిర్వహించబడుతుందని తెలిపారు.ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.ప్రజల విజ్ఞాపనలు తీసుకోవడానికి కలెక్టరేట్ లోని రూం నెంబర్ 25 లో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.ప్రజల సమస్యల దరఖాస్తులు హెల్ప్ డెస్క్ లో అందజేయవచ్చని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *