జర్నలిస్టుల సమస్యలపై పోరాడే ఏకైక సంఘం టీడబ్ల్యూజేఎఫ్

సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలి

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య

మనన్యూస్,కామారెడ్డి:రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై పోరాడే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమే అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు.రాబోయే రోజుల్లో జర్నలిస్టుల సమస్యలపై ఫెడరేషన్ ఆధ్వర్యంలో బలమైన పోరాటాలు నిర్వహించాలని అన్నారు.ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అడ్ హక్ కమిటీ కన్వీనర్ కృష్ణమాచారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మామిడి సోమయ్య మాట్లాడారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలపై పోరాటాలు చేసేందుకు ఫెడరేషన్ నాయకత్వం సిద్దం కావాలని సూచించారు. రాష్ట్రంలో,దేశంలో జర్నలిస్టుల పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, హక్కులు హరింపబడుతున్నాయని,పాలకులు ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా దాటవేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారంలో కొనసాగిన గత ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలను పూర్తిగా విస్మరించి తీరని అన్యాయం చేసిందని,ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా జర్నలిస్టులకు కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు,హెల్త్ కార్డులు ఇవ్వలేక పోయిందని,జీవో 239 సమీక్ష పేరుతో కమిటీ వేసి కాలయాపన చేస్తుందని విమర్శించారు.జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, పెన్షన్ స్కీం,హెల్త్ కార్డులు, దాడుల నివారణకు ప్రత్యేక కమిటీలు,జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తదితర డిమాండ్ల సాధనకై ఫెడరేషన్ ఆధ్వర్యంలో బలమైన ఉద్యమాలు చేయాలని మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం,బండి విజయ్ కుమార్, కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్,నేషనల్ కౌన్సిల్ సభ్యుడు యూసుఫ్ లు మాట్లాడారు.ఈ సమావేశంలో జిల్లా అడ్ హక్ కమిటీ కో-కన్వీనర్లు మోహన్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ప్రారంభించారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..