Harish Rao: తెలంగాణలో రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి.. రైతులను మోసం చేసింది. ఇక్కడి ప్రజలను మోసం చేసింది చాలదన్నట్లు.. ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఆరు హామీల్లో మొదటి హామీనే అమలు చేయలేదని విమర్శించారు. కానీ, రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లి అబద్ధాలు చెబుతున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ. 2500 ఇస్తామని హామీ ఇచ్చింది.. ఇప్పటికీ 11 నెలలు అవుతోంది.. మహిళలకు డబ్బులు ఇచ్చారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. మహారాష్ట్రకు వెళ్లి మాత్రం తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినట్లు చెబుతున్నారని రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 40లక్షల మందికి రుణమాఫీ జరిగిందని ఏఐసీసీ ట్విటర్ లో ప్రచారం చేస్తోంది.. 20లక్షల మంది రైతులకే రుణమాఫీ జరిగింది.. ఇంకా 22లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉంది. ఆలస్యంగా చేసిన రుణమాఫీ వల్ల రైతులు వడ్డీ కట్టాల్సి వచ్చిందని హరీశ్ రావు అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *