

(మన న్యూస్ ప్రతినిధి)ఏలేశ్వరం: స్వామి వివేకానంద 162 వ జయంతి,జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈరోజు సిరిపురం గ్రామ సచివాలయం వద్ద వివేకానంద యూత్ ఆద్వర్యం లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.చిద్గగనానంద గీతాశ్రమం శ్రీస్వామి మహేశ్వారానంద పాల్గొని యువతకు వివేకానంద ఆదర్శప్రాయుడనీ,సనాతన ధర్మాన్ని,హైందవ ఆచారాలను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన మహనీయుడని, యువతకు పట్టుదల,ఏకాగ్రత ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పీతల నూకరాజు,పంచాయితీ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి,వివేకానంద యూత్ గౌరవ అధ్యక్షులు పెదకాపు,యూత్ సభ్యులు అనపర్తి మణి కుమార్,కూటమి నాయకులు సంగన ప్రభుజీ ,వెలుగూరి హరేరామ,సాగి బంగార్రాజు, బచ్చల నాగ శివ,కొల్లా శ్రీనివాస్, మేడిది సింహాచలం,వనుం శ్రీనివాస్,అచ్చే వీరబాబు,అనపర్తి దుర్గాప్రసాద్,సాగి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.