సంప్రదాయ క్రీడా విజేతలకు బహుతలు అందజేసిన ఎమ్మెల్యే సత్యప్రభ

(మన న్యూస్ ప్రతినిధి)ఏలేశ్వరం:కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు స్థానిక గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.సూర్య అప్పారావు ఆధ్వర్యంలోఎస్ఐ ఎన్.రామలింగేశ్వరరావు
నేతృత్వంలో గ్రామీణ సాంప్రదాయ క్రీడ పోటీలలు రెండోవ రోజు నిర్వహించారు.ఆహ్లాదకర వాతావరణంలో సంప్రదాయం బద్దంగా జరిగిన వాలీబాల్ పోటీల విజేతల బహుమతి ప్రదానానికి స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రధమ, ద్వితీయ,తృతీయ శ్రేణిలకు నగదు బహుమతులతోపాటు మెమెంటోలు అందజేశారు.పోటీల్లో ప్రధమ విజేతగా ఏలేశ్వరం టీమ్ కు 10 వేలు రూపాయలు,ద్వితీయ బహుమతి వాసు టీమ్ కు 7వేల రూపాయలు, తృతీయ బహుమతి హాస్టల్ బాయ్స్ టీమ్ కు 5 వేల రూపాయలతో పాటు మెమెంటోలు ఎమ్మెల్యే సత్యప్రభ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.సూర్యఅప్పారావు,సబ్ ఇన్స్పెక్టర్ రామలింగేశ్వరావు చేతుల మీదుగా విజేతలకుఅందజేశారు.క్రీడాపోటీలను సజావుగా నిర్వహించిన పిఈటి లకు టీ షర్ట్లు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమకున్న బిజీ షెడ్యూల్తో పాటు క్రీడలపై దృష్టి సారించి నియోజకవర్గ వ్యాప్తంగా సాంప్రదాయ క్రీడలు చేపట్టిన పోలీస్ యంత్రాంగాని అభినందించారు.
సిఐ,ఎస్ ఐలు మాట్లాడుతూ క్రీడలువలన మానసిక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో ప్రజలు కుటుంబ సభ్యులతో గడుపుతూసంక్రాంతి పండుగ జరుపుకోవాలని అన్నారు.ముఖ్యంగా యువత పేకాట,గుండాట,కోడిపందాలు,వంటి జూదాల జోలికి వెళ్ళకుండా ఉండాలని తెలిపారు.అటువంటి అసాంఘిక కార్యక్రమాలకు ఎవరు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన సాంప్రదాయ క్రీడా పోటీలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎస్సై రామలింగేశ్వరరావు అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎస్ఐ లక్ష్మీకాంతం,ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, నాయకులు బొద్దిరెడ్డి గోపి,మూది నారాయణస్వామి,జ్యోతుల పెదబాబు,ఎండగుడినాగబాబు,పెండ్ర శ్రీను,బస్సా ప్రసాద్,పలివెల వెంకటేశ్వరావు,పలివెల శ్రీను, పెంటకోట శ్రీధర్,నూకతాటి ఈశ్వరరావు,జోన్నాడ వీరబాబు, కర్రోతు గాంధీ,పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు హాజరయ్యారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..