

మన న్యూస్:గొల్లప్రోలు మండలం,దుర్గాడ గ్రామ ప్రసిద్ధిగాంచిన శివాలయంలో కేసరపల్లి భువనేశ్వరి శ్రీ కమలానంద సరస్వతి స్వామి జనవరి 5వ తారీఖున విజయవాడలో జరిగే హైందవ శంఖారావాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఆలయ అర్చకులు.సేవా సభ్యులు.పూర్ణకుంభ స్వాగతం తో ఆహ్వానించి శివాలయం ఆలయ చరిత్రను తెలియజేశారు.మన హిందూ సంస్కృతిని,హైందవ ధర్మాన్ని, ధర్మపధంలో నడిపించాలని మన దేవాలయాలు సంరక్షించుకోవాలని అనుగ్రహ భాషణ చేశారు.ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సభ్యులు,ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు.