విశాఖ మన ద్యాస ప్రతినిధి నవంబర్ 17: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని గాజువాక సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో 84 వ వార్డు కార్పొరేటర్ గుడివాడ అనూష లతీష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ గారికి అనూష లతీష్ చేతుల మీదుగా వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందచేయడం జరిగింది తగనంతరం విశాఖలో గెలిచిన కార్పొరేటర్లకు అభినందనలు తెలుపుతూ విశాఖలో ఎంతో ప్రతిభ కనబరిచిన ప్రతి కార్పొరేటర్ కి కూడా నా శుభాకాంక్షలు అని తెలిపారు తదనంతరం విశాఖలో పరిస్థితులపైన ప్రజలకు అందే సంక్షేమ ఫలాల గురించి ప్రజా సమస్యల పైన భేటీ జరిగింది తదనంతరం కార్యకర్తలకు అభిమానులకు కూడా ఎప్పుడు అండగా ఉండాలని ఈ సందర్భంగా వైయస్ జగన్ తెలిపారు. ఈ సందర్భంగా 84 వార్డ్ కార్పొరేటర్ అనూష లతీష్ మాట్లాడుతూ 2029వ సంవత్సరంలో మరల రెండవసారి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులుగా గెలుపొందే వరకు నా సాయి శక్తుల శ్రమిస్తానని తెలిపారు. వాట్ అభివృద్ధితోపాటు గాజువాక నియోజకవర్గం తిప్పల దేవన్ రెడ్డిని గాజువాక ఎమ్మెల్యే గాను, వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గాను శ్రమించి పార్టీని మరింత బలోపేతం చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *