నిజాంసాగర్, నవంబర్ 15 (మన న్యూస్): అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. ఆదివారం మొహమ్మద్‌నగర్ మండల కేంద్రంతో పాటు నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ సొసైటీ ఫంక్షన్ హాల్లో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల చెక్కులను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో అర్హులైన అనేకమందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులను గుర్తించి సంక్షేమ పథకాలను అందజేస్తోందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేదలు, మహిళలు, వృద్ధులు, నిరుపేద కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ప్రజా పండరి, రవీందర్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు సరస్వతి,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రమేష్ యాదవ్, సంకు లక్ష్మయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గోరుగంటి కిరణ్, అచ్చంపేట సొసైటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సర్పంచులు కుమ్మరి రాములు, గజ్జల జీవన్, రఫీ, హరిన్, కాంగ్రెస్ నాయకులు నాగభూషణం గౌడ్, సవాయి సింగ్, లోక్యా నాయక్, నర్సింలు, ఆకాష్, నగేష్, గుర్రపు శ్రీనివాస్, బండ్ల ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ లత, భుజంగారావు, ఎంపీడీవో అనిత, శివకృష్ణ, ఆయా గ్రామాల లబ్ధిదారులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

