• 30ఏళ్ల అపజయం ఎరుగని చరిత్ర..

సింహాచలం మన ధ్యాస ప్రతినిధి నవంబర్8:జీవీఎంసీ 96వ వార్డు కార్పొరేటర్‌గా ఐదోసారి ఘనవిజయం సాధించిన సందర్భంగా ప్రజా నాయకుడు గంధం శ్రీనివాసరావు తన అభిమానులు,కార్యకర్తలతో కలిసి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని కాలినడకన వెళ్లి దర్శించుకున్నారు.30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఇప్పటివరకు ఓటమి అనేదే ఎరుగని నాయకుడిగా నిలిచిన గంధం శ్రీనివాసరావు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో 96వ వార్డు నుంచి వరుసగా ఐదోసారి కార్పొరేటర్‌గా గెలుపొంది రికార్డు సృష్టించారు. ఈ అపూర్వ విజయాన్ని పురస్కరించుకుని, గతంలో చేసుకున్న మొక్కుబడులను తీర్చుకునేందుకు కార్యకర్తలు, అనుచరులతో కలిసి మెట్ల మార్గంలో కాలినడకన కొండపైకి చేరుకున్నారు.స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గంధం శ్రీనివాసరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఐదోసారి కూడా అఖండ విజయాన్ని అందించిన 96వ వార్డు ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ప్రజల ఆశీస్సులతో, స్వామివారి కృపతో వార్డును మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వార్డు ప్రజలు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని తమ నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *