తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిగా 20వ డివిజన్ నుంచి ఘన విజయం సాధించిన కార్పొరేటర్ షహీనా తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జనసేన సీనియర్ నేత ఎస్.కె. బాబు కోడలైన షహీనా తన కుటుంబ సభ్యులు, కూటమి నాయకులతో కలిసి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి నివాసంలో వారిని కలిసి శాలువా కప్పి,పుష్పగుచ్ఛం అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ షహీనా కి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.డివిజన్ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండి పనిచేయాలని, కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *