కలిగిరి బిట్ 2 ప్రజలంతా కూటమి వైపే.. సైకిల్ దూసుకుపోతోంది
కలిగిరి అక్టోబర్ 30, మన ధ్యాస ప్రతినిధి.
కలిగిరి మండలంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్నికల ప్రచారం రోజురోజుకీ ఉధృతంగా సాగుతోంది. ఈరోజు కలిగిరి బిట్-2 ఎంపీటీసీ పరిధిలో కూటమి బలపరిచిన అభ్యర్థి బండారు మల్లికార్జున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఉదయం నుండి సాయంత్రం వరకు గ్రామంలోని ప్రతి వీధి, ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరించారు. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటూ, యువతతో, మహిళలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా బండారు మల్లికార్జున మాట్లాడుతూ,పదవి అనేది ప్రజల సేవకే అలంకారం. గతంలో మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కలిగిరి మండలంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి. రోడ్లు, తాగునీటి సౌకర్యం, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయి. అదే అభివృద్ధిని స్థానిక సంస్థల్లో కూడా కొనసాగించాలంటే సైకిల్ గుర్తును గెలిపించాలి” అని అన్నారు.అంతేకాకుండా, “నాకు ఎంపీటీసీగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించడమే కాకుండా, మన కలిగిరి జెడ్పిటిసి అభ్యర్థి, ప్రజల మనిషి మెట్టుకూరు శిరీష రెడ్డి కి కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఈ ప్రచార కార్యక్రమానికి ప్రజల నుండి మంచి విశేష స్పందన లభించింది. ఎక్కడ చూసినా “జై తెలుగుదేశం, జై కూటమి” అనే నినాదాలతో గ్రామం మార్మోగింది.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, క్లస్టర్ ఇన్చార్జ్ లు, యూనిట్ ఇన్చార్జ్ లు, బూత్ కన్వీనర్లు, మహిళా నాయకులు, యువత, మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
