సహచర శాసనసభ్యులు, జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి తిరుపతి వీధుల్లో నిర్వహించిన భారీ ర్యాలీ అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా సాగింది.

పార్టీ శ్రేణులు, వేలాది మంది అభిమానులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో తిరుపతి పురవీధులన్నీ పసుపుమయంగా మారాయి.

ర్యాలీ అనంతరం వివిధ డివిజన్లలో ఇంటింటి ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి , కూటమి తరఫున పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులకు, మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ కి మద్దతుగా ఓటర్లను నేరుగా కలిసి ఓట్లను అభ్యర్థించారు.

ప్రజల నుంచి ఎమ్మెల్యేకి బ్రహ్మరథం పడుతూ ఘన స్వాగతం లభించింది.

ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రసంగిస్తూ శ్రీవేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఉన్న ఆధ్యాత్మిక నగరం తిరుపతి సమగ్ర అభివృద్ధి సాధించాలంటే అది కేవలం మన కూటమితోనే సాధ్యమని స్పష్టం చేశారు.

ఆధ్యాత్మిక శోభ దెబ్బతినకుండా, నగరవాసులకు మౌలిక వసతులు కల్పిస్తూ తిరుపతిని మోడల్ సిటీగా తీర్చిదిద్దే సత్తా కూటమి పాలనకే ఉందన్నారు.

స్థానిక సమస్యలను పరిష్కరించి, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసేందుకు మన కూటమి అభ్యర్థులకు ఒక్కసారి అవకాశం ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన తిరుపతి ప్రజలను ఆత్మీయంగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *