రాబోయే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 43వ డివిజన్ ఎన్డీఏ కూటమి తెదేపా కార్పొరేటర్ అభ్యర్థిని దొడ్డారెడ్డి అనిత కి,మేయర్ అభ్యర్థి మన్నెం శ్రీనివాస ప్రసాద్ కి మద్దతుగా తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తూ, ఎన్నికల కరపత్రాలను పంపిణీ చేసి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు.
ప్రజా సంక్షేమం మరియు డివిజన్ సమస్యల తక్షణ పరిష్కారం కోసం కూటమి అభ్యర్థులను ఆశీర్వదించి, ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలని ఆయన కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మరియు ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్ మాజీ ఛైర్మన్ దొడ్డారెడ్డి శంకర్ రెడ్డి , కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

